EPFO ప్రాంతీయ కార్యాలయం వరంగల్ వారు జనవరి 10న ఫిర్యాదుల పరిష్కరణకు ‘నిధి ఆప్కే నికట్’ &’పెన్షన్ అదాలత్’ కార్యక్రమం ఆన్లైన్ లో నిర్వహిస్తున్నారు
ఉదయం 11 :00 నుండి 11:30 వరకు ‘నిధి ఆప్కే నికట్’ – సాధారణ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం మధ్యాహ్నం 3: 00 నుండి 3:30 వరకు ‘పెన్షన్ అదాలత్’ – పెన్షనర్ల ఫిర్యాదుల కార్యక్రమం జరుగుతుంది
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) (ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ), వరంగల్ ప్రాంతీయ కార్యాలయం తమ సభ్యులకు మెరుగైన సేవలు అందించేందుకు, సభ్యులు మరియు పెన్షనర్ల ఫిర్యాదులు పరిష్కరించేందుకు జనవరి 10 సోమవారం నాడు ‘నిధి ఆప్కే నికట్’ & ‘పెన్షన్ అదాలత్’ కార్యక్రమాలు ఆన్లైన్ లో నిర్వహిస్తోంది. సాధారణ సమస్యలు / ఫిర్యాదుల పరిష్కారానికి జనవరి 10 ఉదయం 11:00 నుండి 11:30 వరకు ‘నిధి ఆప్కే నికట్’ కార్యక్రమం, పెన్షనర్ల సమస్యల, ఫిర్యాదుల పరిష్కారానికి మధ్యాహ్నం 3:00 నుండి 3:30 వరకు ‘పెన్షన్ అదాలత్’ కార్యక్రమం నిర్వహించబడును. ఈ కార్యక్రమాలలో ప్రాంతీయ కమీషనర్ స్వయంగా పాల్గొని ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమాలు వర్చ్యువల్ విధానంలో Webex Platform ద్వారా పైన చెప్పిన సమయాలలో నిర్వహించబడతాయి. Meeting number: 2643 239 7183 పాస్వర్డ్ : 1234 ఉపయోగించి ఉదయం ‘నిధి ఆప్కే నికట్’ కార్యక్రమం లోను, Meeting number: 2640740 1568 పాస్వర్డ్ : 1234 ఉపయోగించి మధ్యాహ్నం పెన్షన్ అదాలత్ కార్యక్రమంలోనూ webex ద్వారా పాల్గొనవచ్చు.
ఈ అవకాశాన్ని యాజమాన్యాలు, సభ్యులు, పెన్షనర్లు వినియోగించుకోగలరు. మరింత సమాచారం కోసం
0870-2447772 కానీ ro.warangal@epfindia.gov.in మెయిల్ నందు కానీ సంప్రదించగలరు.
For Bellary Office : https://meetingsapac33.webex.com/meet/pr1766540889… Meeting id – 1766540889