Thu. Jan 16th, 2025

కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయు పూర్తి విధానము

Covid వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి, ఒకటి వెబ్సైట్ నుంచి అనగా cowin.gov.in అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే రెండవ పద్ధతి వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ రెండు పద్ధతులు ఏ విధంగా ఉంటాయి అనేది మీరు క్రింద చదవండి.

కోవిన్ వెబ్సైట్ నుండి :

ముందుగా అధికారిక వెబ్సైట్ లోకి ఎంటర్ అవ్వండి (ఇక్కడ క్లిక్ చేయండి)  ఎంటర్ అయిన తర్వాత పైన మీకు వ్యాక్సినేషన్ సర్వీస్ అను ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినచో డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది, అందులో మీకు డౌన్లోడ్ సర్టిఫికెట్ అనే ఆప్షన్ ఉంటుంది దానిని మీరు చేయాలి.

ఆ తరువాత మీకు ఇలాంటి స్క్రీన్ కనిపిస్తుంది, ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి వ్యాక్సినేషన్ సమయంలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ అవుతారు అదే మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి get otp అనే ఆప్షన్ ని క్లిక్ చేసి మీ మొబైల్ కి పంపించాలి.

ఆ తరువాత మీరు ఓటిపి ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ అనే బటన్ క్లిక్ చేయండి


తరువాత పేజీలో మీకు సంబంధించిన ఎకౌంటు డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి, అందులో మీకు సర్టిఫికెట్ అనే ఒక బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసినచో మీకు సంబంధించిన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది,ఈ విధంగా ఈ పద్ధతి ద్వారా మీరు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

వాట్సాప్ ద్వారా :

ముందుగా మీరు మై జి ఓ వి కరోనా హెల్ప్ డెస్క్ వారి మొబైల్ నెంబర్ ని నీ ఫోన్లో సేవ్ చేసుకోవాలి,

మొబైల్ నెంబర్ : 9013151515

వాట్సప్ ఓపెన్ చేసిన తర్వాత ముందుగా మీరు వాట్సాప్ టెక్స్ట్ బాక్స్ లో డౌన్లోడ్ సర్టిఫికెట్ అని ఎంటర్ చేసి సెండ్ చేయాలి, అప్పుడు మీ మొబైల్ కి ఓటిపి వస్తుంది ఆ ఓటీపీ ని టెక్స్ట్ బాక్స్ లో ఎంటర్ చేసి సెండ్ చేయాలి, చేసినచో మళ్ళీ మీకు మీకు సంబంధించిన డీటెయిల్స్ అనగా మీ మొబైల్ నెంబర్ అనేవి కనిపిస్తాయి అక్కడ మీకు ఒకటి టైప్ చేసి సెండ్ చేయమని అడుగుతుంది ఒకటి టైప్ చేసి సెండ్ చేసినచో మీ సర్టిఫికెట్ సంబంధించిన పిడిఎఫ్ ఫైల్ అనేది మీకు కరోనా హెల్ప్ డెస్క్ వారు పంపించడం జరుగుతుంది, ఈ విధంగా మీరు వాట్సాప్ ద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందవచ్చు.

https://www.cowin.gov.in/

మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఈ అధికారిక వెబ్సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.మా యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియోని ఇక్కడ చూడండి.

Click here

By Sivamin

Leave a Reply

Your email address will not be published.