యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) యొక్క mAadhaar యాప్ యూజర్లు తమ కుటుంబ సభ్యుల ప్రొఫైల్‌లను యాప్‌తో లింక్ చేయడానికి సహాయపడుతుంది, అంతే కాకుండా వాళ్ళ ఆధార్ కార్డులు కూడా అక్కడే డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించింది, కావున వాళ్ళ ఆధార్ ను ఏవిధంగా ఆడ్ చేయాలి డౌన్లోడ్ చేయాలి అనే విషయాలు క్రింది మీరు చూడొచ్చు.
ముందుగా మీ మొబైల్లో మై ఆధార్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి దాని కొరకు ఇక్కడ క్లిక్ చేయండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసి పర్మిషన్ ని లవ్ చేసి మొబైల్ ఓటీపీ ని వెరిఫై చేసుకున్న తర్వాత యాప్ లోకి ఎంటర్ అవుతారు, అక్కడ మీకు రిజిస్టర్ మై ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది దాని పై క్లిక్ చెయ్యాలి.
క్లిక్ చేసిన తర్వాత మీరు నాలుగు అంకెల పాస్వర్డ్ ని రెండుసార్లు ఎంటర్ చేసి క్రియేట్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ నంబర్ మరియు క్యాప్ చా అడుగుతుంది అవి మీరు ఎంటర్ చేసి అక్కడ మీరు ఓటిపి ద్వారా వెరిఫై చేసుకోవాలి.
అలా ఓటిపి ఎంటర్ చేసి వెరిఫై చేయగానే మీ ప్రొఫైల్ అనేది యాడ్ అవుతుంది అట్లాగే మీరు వేరొకరి ప్రొఫైల్ ఆడ్ చేయాలంటే పైన మీకు ప్లస్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి మునుపటి ప్రొఫైల్ ని ఎలాగైతే క్రియేట్ చేసుకున్నారో అదే ప్రాసెస్ చేసి మరొకరి ప్రొఫైల్ ని యాడ్ చేయవచ్చు.
అలా ఐదుగురి ప్రొఫైల్స్ ని యాడ్ చేసి మీరు ఐదుగురు కి సంబంధించిన ఆధార్ కార్డులను ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు.