Thu. Dec 26th, 2024

భారతదేశంలో మొట్టమొదటిగా, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) IIFL ఫైనాన్స్ Whatsapp వినియోగదారుల కోసం రూ. 10 లక్షల వరకు తక్షణ వ్యాపార రుణ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ ప్రకారం, వినియోగదారులు మెసేజింగ్ యాప్‌లో ‘హాయ్’ అని చెప్పడం ద్వారా కొన్ని నిమిషాల్లో రూ. 10 లక్షల వరకు రుణం పొందవచ్చు.

వాట్సాప్‌లో తక్షణ బిజినెస్ లోన్‌ను ప్రారంభించిన దేశంలో మొట్టమొదటి ఎన్‌బిఎఫ్‌సి మేము. కనీస డాక్యుమెంటేషన్ మరియు ఆమోదంతో వినియోగదారులు 5 నిమిషాల్లో రూ. 10 లక్షల రుణం పొందవచ్చు, ”అని NBFC ఒక ప్రకటనలో తెలిపింది.

కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-బోట్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది, ఇది వినియోగదారుల వివరాలను లోన్ ఆఫర్‌కి సరిపోతుంది మరియు KYC మరియు బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ ద్వారా అప్లికేషన్‌ను సులభతరం చేస్తుంది, IIFL తెలిపింది.

వాట్సప్ ద్వారా మీరు లోన్ పొందాలంటే ముందుగా హాయ్ అనే సందేశాన్ని వాళ్లకు మీరు పంపాలి

అలా పంపిన తర్వాత AI బోట్ మీకు ఒక సందేశాన్ని పంపిస్తుంది, అనగా మీరు వ్యాపార రుణం తీసుకుంటారా ఎంత తీసుకుంటారు మేము ఎంత ఇవ్వగలము ఎన్ని గంటల్లో మీకు రుణం మీ ఖాతాలోకి అందించగలం ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు కనిపిస్తాయి.

ఆ తరువాత మీ పేరు, మీరు వ్యాపారం ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు, అలాగే మీకు ఎంత లోను కావాలి అనే విషయాలు అన్నీ కూడా అడుగుతుంది మీరు వాటికి సమాధానం ఇవ్వాలి.

ఆ తరువాత మీ మొబైల్ కి OTP పంపిస్తుంది ఓటీపీ ని వెరిఫై చేసుకోవాలి, చేసుకున్న తర్వాత మీ పాన్ కార్డు నెంబరు అలాగే మీ పుట్టిన సంవత్సరం ఎంటర్ చేయమంటుంది ఇవన్నీ కూడా ఎంటర్ చేసి మీరు కన్ఫామ్ చేసుకోవాలి.

ఆ తరువాత మిమ్మల్ని మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది ID ఎంటర్ చేయాలి, ఎంటర్ చేసిన తర్వాత CIBIL నుంచి ఓటిపి పంపిస్తుంది ఓటీపీ ని ఎంటర్ చేసి కన్ఫామ్ చేసుకోవాలి.

ఆ తరువాత మీరు ఎంటర్ చేసిన వివరాలను బట్టి మీ సిబిల్ స్కోర్ బట్టి మీకు ఎంత లోన్ వస్తుంది, మీ సివిల్ స్కోర్ ఎంతుంది, రేట్ అఫ్ ఇంట్రెస్ట్ ఎంత,  అలాగే EMI మరియు రీపేమెంట్ నెలలు అన్ని కూడా చూపిస్తుంది.

తరువాత మీకు వీళ్లు చూపించిన అమౌంట్ లో మీకు ఎంత లోన్ కావాలో అంత ఎంటర్ చేయాలి, ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఆ తర్వాత మీ బ్యాంక్ వివరాలు అడుగుతుంది అవి కూడా ఎంటర్ చేసిన తర్వాత మిమ్మల్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని ఒక లింక్ పంపిస్తుంది, లింకు ద్వారా డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే మీకు 24 గంటల్లో లోన్ అమౌంట్ మొత్తం మీ ఖాతాలో జమ చేయబడుతుంది

వాట్సాప్ నంబర్ 9019702184

అధికారిక వెబ్ సైట్ కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

By Sivamin

Leave a Reply

Your email address will not be published.