రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా మహమ్మారి సృష్టించిన విలయతాండవంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆర్థికంగానే కాదు.. ఒక తరం అంతరించిపోతుందా అనిపిస్తే.. భవిష్యత్ తరాలకు చదువు, అభివృద్ధి అనేది సుదూరం అనే విధంగా ప్రభావం చూపించింది. ఇక కరోనాబారిన పడి అనేక మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. ముఖ్యంగా కుటుంబానికి ఆసరాగా నిలబడే అండను పోగొట్టుకుని ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ కారణంగా మరణించిన మృతుల కుటుంబ సభ్యులకు రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ సర్కార్ ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది
50,000 ఎక్స్గ్రేషియా కొరకు అప్లై చేయడానికి ముందుగా ఇక్కడ క్లిక్ చేయండి
ఆ తరువాత మీకు ఇలాంటి పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటిపి సెండ్ చేసి వచ్చిన ఓటీపీ వెరిఫై చేసుకోవాలి
ఆ తరువాత అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఈ అప్లికేషన్ లో మీ పేరు రిలేషన్షిప్ మీ అడ్రస్ బ్యాంకు తదితర వివరాలు ఎంటర్ చేయాలి దీంతోపాటు డెత్ సర్టిఫికెట్ కోవిడ్ నిర్ధారణ సర్టిఫికెట్ బ్యాంకు స్టేట్మెంట్ లేదా పాస్బుక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఆధార్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది
Application for issue of exgratia for COVID-19 Death