Mon. Jan 13th, 2025

EPS పెన్షనర్లకు ముఖ్య గమనిక:

ప్రతి సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్ నెలలలో సమర్పించవలసిన డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ లేదా జీవన్ ప్రమాన్ పత్ర ఇకపై ఏడాది పొడవునా ఏ సమయంలో నైనా సమర్పించవచ్చు. అలా సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్ , సమర్పించిన తేదీ నుండి ఒక సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది.

డిసెంబర్ 2020 లో లేదా ఆ తర్వాత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన పెన్షనర్లు లేదా పెన్షన్ పొందడం మొదలయ్యి ఏడాది కూడా అవ్వని పెన్షనర్లు ఈ సంవత్సరం నవంబర్ లోనే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా పెన్షనర్లు EPFO కార్యాలయాలకు వెల్లవలసిన అవసరం లేకుండానే వారు పెన్షన్ స్వీకరిస్తున్న బ్యాంకు శాఖ వద్ద కానీ, కేంద్ర ప్రభుత్వ UMANG ఆప్ ద్వారా కానీ, కామన్ సర్వీస్ సెంటర్లలో కానీ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాన్ పత్ర సమర్పించే వెసులుబాటు ఉంది.

తమ సమీపంలో ఉన్న జీవన్ ప్రమాన్ సెంటర్ ల వివరాలు తెలుసుకునేందుకు పెన్షనర్లు JPL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి వారి ప్రాంతం యొక్క “పిన్ కోడ్” టైప్ చేసి 7738299899 నంబర్ కి SMS పంపవచ్చు లేదా https://jeevanpramaan.gov.in/ వెబ్సైట్ లో locate a centre అన్న టాబ్ ద్వారా అయినా సమీప జీవన్ ప్రమాన్ సెంటర్ల వివరాలు పొందవచ్చు లేదా https://locator.csccloud.in/ లింక్ ద్వారా కామన్ సర్వీస్ సెంటర్ల వివరాలు పొందవచ్చు. అంతే కాక నామమాత్ర ఫీజు చెల్లించి పెన్షనర్లు తమకు సమీపంలో ఉన్న ఏదైనా పోస్ట్ ఆఫీసును సందర్శించి కానీ లేదా పోస్టుమాన్ ద్వారా కానీ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు.

ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు పెన్షనర్లు వారి ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, బాంక్ ఖాతా వివరాలు, ppo నంబరు సిద్ధంగా ఉంచుకోవాలి. పెన్షనర్లు తమ జీవన్ ప్రమాన్ పత్రకు సంబంధించిన వివరాలు epfo పెన్షనర్ల పోర్టల్ లో పొందవచ్చు. ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాన్ పత్ర సమర్పించిన తరువాత పెన్షనర్లు ఎటువంటి కాగితాలు లేదా రసీదులు EPFO కార్యాలయనికి పంపవలసిన అవసరం లేదు.

PF కార్యాలయాలు చేరుకోవడానికి సుదూర ప్రాంతాలు ప్రయాణించడం లేదా ప్రజా రవాణా వ్యవస్థ వాడటం మరియు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు అధిక సమయం క్యూలలో నిలుచోవడం లేదా గుంపులుగా గుముగూడటం వల్ల పెన్షనర్లు కోవిడ్ వైరస్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన పెన్షనర్లు PF కార్యాలయాలలోనే కాక, తమకు దగ్గరలో ఉన్న బ్యాంకు శాఖ వద్ద కానీ, కేంద్ర ప్రభుత్వ UMANG ఆప్ ద్వారా కానీ, కామన్ సర్వీస్ సెంటర్లలో కానీ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. అలా సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్ కూడా PF కార్యాలయాలలో సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్ మాదిరిగానే చెల్లుబాటు అవుతుంది. అలా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన తరువాత PF ఆఫీస్ సందర్శించవలసిన అవసరం కానీ, ఎటువంటి కాగితాలు | రశీదులు కానీ PF ఆఫీసులో సమర్పించవలసిన అవసరం లేదు.

By Sivamin

Leave a Reply

Your email address will not be published.