Thu. Oct 23rd, 2025
WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల Smart Ration Card Andhra Pradesh 2025 ఉచిత పంపిణీ కార్యక్రమము AP Smart Ration Card Launch Date ఆగస్టు 25 , 2025 నుండి ప్రారంభం అయింది. ప్రస్తుతం ఉన్న రైస్ కార్డుల స్థానంలో ఇకమీదట కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలు ఉన్న ATM కార్డు సైజులో ఉండే స్మార్ట్ రేషన్ కార్డులను అందరికీ ఉచితంగా ప్రభుత్వం ఇవ్వనుంది. దీనిపై ప్రజాప్రతినిధుల ఫోటోలు ఎవరివి ఉండవు. కేవలం ప్రభుత్వ అధికారిక ఫోటో మరియు కుటుంబ పెద్ద ఫోటో మాత్రమే ఉంటాయి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాప్ లో ఉన్నటువంటి డీలర్లకు రెవెన్యూ సిబ్బంది ద్వారా అందించడం ఉంది. ఆ రేషన్ షాపు ఏ గ్రామా లేదా వార్డు సచివాల పరిధికి వస్తుందో ఆ సచివాలయంలో పనిచేస్తున్న VRO / గ్రామ సర్వేయర్  / మహిళా పోలీస్ / డిజిటల్ అసిస్టెంట్ వారిలో ఒకరిని ఆ FP Shop /  షాపు రేషన్ షాప్ కు ట్యాగ్ చేయనున్నారు. రేషన్ డీలర్ వద్ద ePOS మెషిన్ లో కొత్త రేషన్ కార్డులు తీసుకునే సమయంలో సిటిజన్ బయోమెట్రిక్ వేసి కార్డుని పొందాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత సంబంధిత గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వారి GSWS Employees App లో Rice Card Distribution New అనే ఆప్షన్ లో కార్డు తీసుకున్నట్టు ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది దానికి బయోమెట్రిక్ లేదా ఫేస్ లేదా OTP అయినా సరిపోతుంది. సచివాలయ సిబ్బంది లాగిన్ లో కేవలం కార్డు పొందిన తర్వాత మాత్రమే ధ్రువీకరించాల్సి ఉంటుంది. 

రేషన్ కార్డుల పంపిణీ ఆగస్టు 25 తో ప్రారంభమైనప్పటికీ ఒకే రోజు అన్ని జిల్లాలలో ప్రారంభమవ్వదు. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మొత్తం నాలుగు దశల్లో చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్క దశలో కొన్ని జిల్లాలలో పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఏ దశలో ఏ జిల్లాలో పంపిణీ ప్రక్రియ జరుగుతుంది అది ఏ రోజు నుంచి ఏ రోజు వరకు కొనసాగుతుందో కింద తెలుసుకోండి. మొదటి విడతలో – 53 లక్షలు, రెండోవ విడతలో – 23.70 లక్షలు, మూడవ విడతలో 23 లక్షలు, నాల్గవ విడతలో 46 లక్షలు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ .జిల్లాల వారీగా విడతల వారీగా పంపిణీ కింద చూపిన విధంగా ఉంటుంది. ఆయా జిల్లాలో ఉన్న ప్రజలకు కింద తెలిపిన తేదీలు విడతల వారీగా మాత్రమే ప్రారంభమవుతుంది. 

1వ విడత పంపిణి 

ఆగస్టు 25 నుంచి 

  1. విజయనగరం 
  2. ఎన్టీఆర్ 
  3. తిరుపతి 
  4. విశాఖపట్నం 
  5. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 
  6. శ్రీకాకుళం 
  7. తూర్పుగోదావరి 
  8. పశ్చిమగోదావరి 
  9. కృష్ణ  

2వ విడత పంపిణి 

ఆగష్టు 30 నుండి 

  1. చిత్తూరు 
  2. కాకినాడ 
  3. గుంటూరు 
  4. ఏలూరు  

3వ విడత పంపిణి 

సెప్టెంబర్ 6 నుండి  

  1. అనంతపురం 
  2. అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం 
  3. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ 
  4. అనకాపల్లి 

4వ విడత పంపిణి 

సెప్టెంబర్ 15 నుండి  

  1. బాపట్ల 
  2. పల్నాడు 
  3. వైయస్సార్ కడప 
  4. అన్నమయ్య 
  5. శ్రీ సత్యసాయి 
  6. కర్నూలు 
  7. నంద్యాల 
  8. ప్రకాశం

Check Ration Card Status: Link-1, Kink-2

By Sivamin

Leave a Reply

Your email address will not be published.