పాత పిఎఫ్ ఖాతాను ప్రస్తుతం క్లోజ్ అయిన పిఎఫ్ ఖాతాలోకి బదిలీ చేస్తే ?
సాధారణంగా చాలా మంది పాత పిఎఫ్ ఖాతా ను ప్రస్తుత పిఎఫ్ ఖాతాలోకి బదిలీ చేస్తూ ఉంటారు ఇలా చేసే టైం లో ఒక తప్పయితే చేస్తూ ఉంటారు అదేమిటంటే, పాత పిఎఫ్ ఖాతాను ప్రస్తుతం క్లోజ్ అయిపోయిన పిఎఫ్ ఖాతాలోకి బదిలీ చేస్తూ ఉంటారు ఇలా చేస్తే వాళ్ల పీఎఫ్ డబ్బులు వాళ్ళు విత్డ్రా చేయడానికి అవకాశం లేకుండా పోతుంది, అయితే ఇలాంటి సమయంలో మీరు ఏం చేయాలి అనే దాని గురించి కింద మీకు డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఇక్కడ చదవొచ్చు.
పాత పిఎఫ్ ఖాతా ను ప్రస్తుతం క్లోజ్ అయిపోయిన ఖాతాలోకి డబ్బులు బదిలీ చేసిన వాళ్ళు క్రింది కనిపించే ఈ రెండు Forms ద్వారా వాళ్లు తమ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు.
1. కాంపోజిట్ క్లయిమ్ ఫార్మ్ (ఆధార్)
2. కాంపోజిట్ క్లయిమ్ ఫార్మ్ (నాన్ ఆధార్)
కాంపోజిట్ క్లయిమ్ ఫార్మ్ (ఆధార్) కి కాంపోజిట్ క్లయిమ్ ఫార్మ్ (నాన్ ఆధార్) కి వ్యత్యాసాలు రెండే
1.కాంపోజిట్ క్లయిమ్ ఫార్మ్ (ఆధార్) ని సబ్మిట్ చేసే వాళ్ళు ఆధార్ నంబర్ ని తప్పనిసరిగా ఎంటర్ చేయాలి అలాగే వాళ్ళు ఎంప్లాయర్ సిగ్నేచర్ లేకుండా వాళ్ళు పిఎఫ్ ఆఫీస్ లో సబ్మిట్ చేయొచ్చు.
2.అలాగే కాంపోజిట్ క్లయిమ్ ఫార్మ్ (నాన్ ఆధార్) సబ్మిట్ చేసే వాళ్ళు ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయవలసిన అవసరం లేదు అట్లాగే వాళ్ళు తప్పనిసరిగా ఎంప్లాయర్ సిగ్నేచర్ చేయించి పిఎఫ్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి.
మీరు 50 వేలు మించి ఎంప్లాయి ఎంప్లాయర్ షేర్స్ విత్ డ్రా చేయాలంటే తప్పనిసరిగా Form 15g సబ్మిట్ చేయాలి.
ఈ clim ఫార్మ్స్ తో ఈ డాక్యుమెంట్స్ని జతపరచండి
1. ఆధార్ కార్డు
2, పాన్ కార్డు
3, బ్యాంకు పాస్ బుక్ లేదా చెక్ లీఫ్
వీటితో పాటు జిరాక్స్ మీద మీ యొక్క సిగ్నేచర్ చేసి పిఎఫ్ ఆఫీస్ కి సబ్మిట్ చేయాలి
ఈ ఫార్మ్స్ మీకు కావాలంటే కింద కనపడే లింక్ క్లిక్ చేసి ఈ ఫార్మ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి
COMPOSITE CLAIM FORM (AADHAAR)
COMPOSITE CLAIM FORM (NON-AADHAAR)