Tue. Jul 23rd, 2024

LIC డేటా లో మీ అడ్రస్ మార్చుకునే విధానము

ఎల్ఐసి డేటా లో మీ అడ్రస్ మార్చుటకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు దీనిని సులభతరం చేసింది, ఆఫీసుల చుట్టూ తిరిగి మీరు ఇబ్బందులు పడకుండా మీ యొక్క అడ్రస్ ని ఆన్లైన్ ద్వారానే మార్చుకోవచ్చు, అది ఏ విధంగా మార్చుకోవాలి అనేది క్రింది మీరు చదవొచ్చు.

చిరునామా మార్పు కోసం ఈ ప్రక్రియ ఆఫ్‌లైన్ ఆధార్ ఆధారంగా ఉంటుంది

అందుబాటులో ఉన్న రెండు ఎంపికలు క్రింది విధంగా ఉన్నాయి:

  • కొత్త చిరునామా ఆధార్ నుండి తీసుకోవచ్చు, దీని కోసం వివరాలు ధృవీకరించబడతాయి.
  • చిరునామా మార్పు కోసం ఏదైనా చెల్లుబాటు అయ్యే చిరునామా రుజువులను ఉపయోగించండి. ప్రక్రియను పూర్తి చేయడానికి చిరునామా రుజువును అప్‌లోడ్ చేయాలి.

ఈ ప్రక్రియ ఆఫ్‌లైన్ ఆధార్‌పై ఆధారపడినందున, పాలసీ నంబర్ కాకుండా ఈ క్రింది వివరాలు అవసరం.

  • మరింత కొనసాగే ముందు దయచేసి అదే విధంగా సిద్ధంగా ఉండండి.
  • UIDAI నుండి డౌన్‌లోడ్ చేయబడిన XML జిప్ ఫైల్ (ఫైల్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి)
  • XML జిప్ ఫైల్‌కు సంబంధించిన షేర్ కోడ్
  • ఆధార్‌తో రిజిస్టర్ చేయబడిన నంబర్ కలిగిన మొబైల్ ఫోన్ (OTP కోసం)
  • ఈ-సంతకం కోసం ఆధార్ VID. ఆధార్ VID ని రూపొందించడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  • ఒక అభ్యర్థనలో చిరునామా మార్పు కోసం గరిష్టంగా 10 పాలసీలు అనుమతించబడతాయి. అదనపు పాలసీల కోసం, కొత్త అభ్యర్థన నమోదు చేయబడవచ్చు.
  • చిరునామా మార్పు అనేది ఇన్ఫోర్స్, పెయిడ్-అప్ పాలసీలకు మాత్రమే అనుమతించబడుతుంది.

1. ముందుగా మీకు కనబడే ఈ చెక్ బాక్స్ల మీద టిక్ మార్క్ చేసి సబ్మిట్ చేయాలి.

2. ఆ తరువాత మీకు పాలసీ నంబర్, మొబైల్ నెంబర్, ఇ-మెయిల్ ఐడి, క్యాప్చా ఈ నాలుగు మీరు ఎంటర్ చేసి చెక్ అండ్ జనరేట్ ఓ.టి.పి ని క్లిక్ చేయాలి

3. ఆ తరువాత మీ మొబైల్ కి మరియు ఈ మెయిల్ కి ఓటిపి వస్తుంది ఆ ఓటిపి ని ఈ బాక్స్ లో ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

4. సబ్మిట్ చేసిన తర్వాత ఆఫ్ లైన్ కేవైసీ కాలం ఓపెన్ అవుతుంది, అక్కడ మీరు ఆధార్ HML zip file ని అప్లోడ్ చేసి మరియు మొబైల్ నెంబర్ని అంటే ఆధార్ కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉన్నదో ఆ నంబర్ ని మీరు ఎంటర్ చేయాలి ఆ తర్వాత పాస్ కోడ్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

5. ఆ తరువాత మీకు ఆధార్ డేటా ప్రకారం ఒక అడ్రస్ కనిపిస్తుంది, అది మీకు నచ్చితే ఉంచుకోవచ్చు లేదా డు యు వాంట్ టు చేంజ్  టు డిఫరెంట్ అడ్రస్ అనే ఒక బటన్ కనిపిస్తుంది దానిని మీరు స్విచ్ ఆన్ చేయాలి.

అలా చేసినట్లయితే మీకు అడ్రస్ టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది, అక్కడ మీరు మీకు నచ్చిన అడ్రస్ ని అనగా మీరు దేనికైతే మరాలి అనుకుంటున్నారో ఆ అడ్రస్ను ఎంటర్ చేసి, దానితోపాటు ఒక అడ్రస్ ప్రూఫ్ ని అప్లోడ్ చేసి క్రింద అప్లోడ్ అనే బటన్ కనిపిస్తుంది దాని ద్వారా మీరు ముందుకు సాగాలి.

6. ఆ తరువాత మీకు యాడ్ మోర్ policies అనే ఒక కాలం ఓపెన్ అవుతుంది, అక్కడ మీరు పది పాలసీలు లోపు ఎన్ని  పాలసీల నైనా యాడ్ చేసుకోవచ్చు, అలా చేసుకున్న తర్వాత క్రింది ప్రొసీడ్ ఫర్ ఈసైన్ అని కనిపిస్తుంది దానిని మీరు క్లిక్ చేయాలి.

7.ఆ తర్వాత మీకు ఈసైన్ డాక్యుమెంట్ కనిపిస్తుంది దానిని మీరు ఓపెన్ చేసి చూడొచ్చు అలాగే Proceed అనే బటన్ క్లిక్ చేసి మీరు ముందుకు సాగాలి, ఆ తర్వాత మీకు Aadhaar VID అడుగుతుంది దానిని మీరు ఎంటర్ చేసి మీ మొబైల్ కి ఓటిపి పంపించాలి ఆ ఓటీపీని వెరిఫై చేసుకున్నట్లయితే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది, ఇలా మీకు సంబంధించిన LIC అడ్రస్ ని మీరు ఆన్లైన్ ద్వారా చాలా సులభంగా మార్చుకోవచ్చు.


మరింత సమాచారం కొరకు ఈ క్రింది కనిపించే వీడియోని చూడొచ్చు


WATCH THIS VIDEO

LIC అధికారిక వెబ్ సైట్ క్రింద ఇవ్వబడింది, ఆ లింకు క్లిక్ చేసి మీరు  మీ యొక్క అడ్రస్  చేంజ్ చేసుకోండి


Click here

By Sivamin

Leave a Reply

Your email address will not be published.