Thu. Sep 12th, 2024

మైఆధార్ వెబ్సైట్ లో ఆధార్ లోని తప్పులు సరి చేసుకునే విధానం

ఇనుక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు మైఆధార్ అను కొత్త వెబ్సైట్ నిర్మించారు ఈ వెబ్సైట్లో వ్యక్తిగత వివరాలు అనగా పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, లింగము, భాష, ఈమెయిల్, అడ్రస్ ఇలాంటి వివరాలు అన్నీ కూడా అప్డేట్ చేసుకోవచ్చు, వీటితో పాటు మరిన్ని సేవలు అనగా ఆధార్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, పివిసి కార్డు ఆర్డర్ పెట్టవచ్చు, లొకేషన్ ట్రాక్ చేయవచ్చు, అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ అలాగే ఈ మెయిల్ ని వెరిఫై చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఎన్నో సేవలు ఇక్కడి నుంచి అనగా మైఆధార్ వెబ్సైట్ నుంచి చాలా తేలికగా పొందవచ్చు.

1. దీనికి ముందుగా మీరు ఈ మైఆధార్ అనే వెబ్ సైట్ లోకి రావాలి.

2. ఆ తరువాత చిత్రంలో చూపిన విధంగా మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి మీ ఆధార్, క్యాప్చా ఎంటర్ చేసి మీ ఆధార్ కి లింకు కాబడిన మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీ ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.


3. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని సర్వీసులు కనిపించడం జరుగుతుంది మీకు ఏదైతే సర్వీస్ కావాలో దాన్ని ఇక్కడ ఎంచుకోవాలి.ఉదాహరణకు: చిరునామా మార్చాలి అని అనుకుoదాo కావున దాని పై క్లిక్ చేసినప్పుడు.

4. ఆ తరువాత పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు క్రిందికి scroll down చేసి అప్డేట్ ఆధార్ ను క్లిక్ చేయాలి.

5. ఆ తరువాత ఇక్కడ మీరు దేనిని అప్డేట్ చేయాలి అనుకుంటున్నారో దానిని మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేసి క్రింది కనిపించే అప్డేట్ ఆధార్ ను క్లిక్ చేయాలి.

6. తరువాత పేజీలో మీరు దేనిని మార్చాలి అనుకుంటున్నారు దానికి సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాలి.

7. ఎంటర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన సపోర్ట్ డాక్యుమెంట్ అనగా ఒక ప్రూఫ్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి ఆ తరువాత ముందుకు సాగాలి.

8. ఆ తరువాత పేజీలో మీరు ఏ విషయం అయితే సరిచేసుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రివ్యూ మీకు కనిపిస్తుంది మీకు ఇది సమ్మతం అయితే క్రింది రెండు చెక్ బాక్స్ లు కనిపిస్తాయి వాటిపై సెలెక్ట్ చేసుకుని ముందుకు సాగాలి.

9. ఆ తరువాత మిమ్మల్ని పేమెంట్ గేట్వే కి తీసుకుని వెళుతుంది అక్కడ మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, పేటీఎం లాంటి పేమెంట్ ఆప్షన్ ని ఎంచుకొని మీరు కొంత డబ్బుని అనగా 50 నుంచి 100 రూపాయల వరకు పే చేయవలసిన అవసరం ఉంటుంది.

10. డబ్బును పేమెంట్ చేసిన అనంతరం మీకు ఒక acknowledgement slip ని డౌన్లోడ్ చేసుకొమని అడుగుతుంది దానిని మీరు డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది.

  • ఈ విధంగా ఆధార్ లో ఉన్న తప్పుల్ని చాలా సులభంగా మైఆధార్ అను కొత్త వెబ్సైట్ నుంచి సరి చేసుకోవచ్చు.
  • మైఆధార్ అను వెబ్సైట్ సంబంధించిన లింక్ ఈ క్రింది ఇవ్వబడింది క్లిక్ చేసి మీరు వెబ్సైట్లోకి లాగిన్ అవ్వొచ్చు.

https://myaadhaar.uidai.gov.in/

ఈ విధానం వీడియో రూపంలో చూడాలంటే ఈ క్రింది కనిపించే లింక్ పై క్లిక్ చేసి మా యూట్యూబ్ ఛానల్ నందు వీక్షించవచ్చు


Click here

By Sivamin

Leave a Reply

Your email address will not be published.