Thu. Sep 12th, 2024

డిజిటల్ హెల్త్ కార్డ్ అంటే ఏమిటి ?

మీకు ప్రస్తుత లేదా పూర్వపు కాలపు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా దానికి సంబంధించిన పూర్తి వైద్య సమాచారము అనగా మెడికల్ రిపోర్ట్స్ అనేవి ఈ యొక్క హెల్త్ ఐడి కార్డు లో పొందుపరచడం జరుగుతుంది, దీని ద్వారా మీరు ఏ డాక్టర్ దగ్గర అయితే వైద్యం చేయించుకోవాలి అనుకుంటారు వాళ్ళకి ఈ కార్డు చూపించడం ద్వారా మీకు సంబంధించిన హెల్త్ రిపోర్ట్ అనేది అనగా హెల్త్ కండిషన్ సులువుగా వాళ్ళకి తెలుస్తుంది, తద్వారా మీకు వైద్యం చేయడానికి వాళ్లకు సులభం అవుతుంది, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అనేక హెల్త్ బెనిఫిట్స్ అనేవి మీకు ఇందులో పొందుపరచడం జరుగుతుంది.

అయితే ముందుగా ఈ కార్డు ఏవిధంగా జనరేట్ చేయాలి, అలాగే డౌన్లోడ్ చేయాలి అనేది మీరు ఇక్కడ చదవొచ్చు, ముందుగా మీరు అధికారిక వెబ్ సైట్ లోకి ఎంటర్ అవ్వాలి ఇక్కడ క్లిక్ చేయండి, అక్కడ మీకు క్రియేట్ యువర్ హెల్త్ ఐడి న్యూ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిని మీరు క్లిక్ చేయాలి.

ఆ తర్వాత మీకు జనరేట్ యువర్ హెల్త్ ఐడి అని ఆధార్ ద్వారా మీరు ప్రాసెస్ చేస్తారా లేకపోతే మొబైల్ ద్వారా చేస్తారా అనేది మీకు కనిపిస్తాయి అక్కడ మీకు సంబంధించిన ఒక ఎంపికను ఎంచుకోండి, ఉదాహరణకు ఆధార్ ద్వారా మీరు ఈ ప్రాసెస్ చేయాలంటే జనరేట్ వయా ఆధార్ అను ఆప్షన్ని క్లిక్ చేయండి.

ఆ తర్వాత మీకు ఇలాంటి స్క్రీన్ ఒకటి కనిపిస్తుంది, ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ లేదా విర్చువల్ ఐడి ని ఎంటర్ చేసి క్రింద ఐ అగ్రీ అలాగే ఐ యాం నాట్ ఎ రోబో ను టిక్ మార్క్ చేసి సబ్మిట్ చేయాలి.

ఆ తరువాత ఆధార్ ఓటిపి జనరేట్ అవుతుంది మీ మొబైల్ కి వచ్చిన ఆధార్ ఓటిపి ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

ఆ తరువాత మిమ్మల్ని ఒక మొబైల్ నెంబర్ అడుగుతుంది ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే గనుక మీ మొబైల్ కి ఓటిపి వస్తుంది ఆ ఓటిపి ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

ఆ తరువాత మీకు సంబంధించిన ప్రొఫైల్ కనిపిస్తుంది మీ ఆధార్ డేటాబేస్ ప్రకారం ఒక ప్రొఫైల్ కనిపిస్తుంది, ఆ ప్రొఫైల్ దగ్గర అడ్రస్ ను క్రియేట్ చేసుకోవాలి మరియు ఈ మెయిల్ ఐడీ ని ఎంటర్ చేయాలి, ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసినట్లయితే గనుక, మీకు సంబంధించిన ఐడి కార్డ్ జనరేటర్ అయ్యి మీకు కనిపిస్తుంది దానిని డౌన్లోడ్ హెల్త్ ఐడి కార్డు అనే ఆప్షన్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఈ విధంగా మీరు మీయొక్క హెల్త్ ఐడి కార్డు చాలా సులువుగా క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

అధికారిక వెబ్ సైట్ కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

By Sivamin

Leave a Reply

Your email address will not be published.