యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఈ సేవలను అందిస్తోంది. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లో మీరు మీ ఆధార్ నెంబర్‌ను ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేశారో తెలుసుకోవచ్చు. అయితే ముందుగా మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండటంత తప్పనిసరి. అలాంటి సమయంలోనే ఈ వివరాలు తెలుస్తాయి. ఒకవేళ మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే చేసుకోవాలి.
ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకోండిలా :
ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో Aadhaar Services పైన క్లిక్ చేయండి.
ఆ తరువాత Check Aadhaar Bank Linking Status లింక్ పైన క్లిక్ చేయండి.
మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చేయాలి.
మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు అకౌంట్‌కు లింక్ అయిందో వివరాలు కనిపిస్తాయి. మీ ఆధార్ నెంబర్ చివరి నాలుగు అంకెలు, బ్యాంక్ లింక్ స్టేటస్, ఎప్పటి నుంచి బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ అయింది, ఏ బ్యాంకుతో ఆధార్ నెంబర్ లింక్ అయిందో వివరాలు తెలుస్తాయి. ఒక వేళ మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ కానట్లయితే మీరు మీ ఖాతా ఉన్న బ్యాంకు వెబ్‌సైట్‌లో ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు.
Website Link Here : https://uidai.gov.in/