Thu. Jul 25th, 2024

మీ మీ ఏరియా లో పెట్రోల్ ధర ఎంత ఉందో చాలా సింపుల్గా ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు అది ఎలానో క్రింది మీరు చూడొచ్చు

దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ (Excise Duty) భారీగా తగ్గించింది. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు నుంచే తగ్గిన రేట్లు అమలులోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Prices) భారీగా తగ్గాయి. ప్రజలకు మరింత లాభం చేకూర్చేందుకు వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT) కూడా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

మీరు హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి పలుప్రాంతాల్లో ఉన్నట్లయితే కనుక క్రింది ఉన్న మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ పంపించి పెట్రోల్ ధరలు ఇలా తెలుసుకోండి

ఎస్ఎంఎస్ ద్వారా పెట్రోల్, డీజిల్ ధరల్ని తెలిపేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) కంపెనీలు ఎస్ఎంఎస్ సర్వీస్ అందిస్తున్నాయి. ఈ కంపెనీలకు చెందిన నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా మీ ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి.

అయితే ఈ కంపెనీలు సూచించిన కోడ్స్ ప్రకారమే ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. ఒకే మెసేజ్‌తో పెట్రోల్, డీజిల్ ధరలు తెలుస్తాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు చెందిన పెట్రోల్ బంకుల్లో రేట్ల కోసం 9224992249 నెంబర్‌కు, భారత్ పెట్రోలియంకు చెందిన పెట్రోల్ బంకుల్లో రేట్ల కోసం 9223112222 నెంబర్‌కు, హిందుస్తాన్ పెట్రోలియంకు చెందిన పెట్రోల్ బంకుల్లో రేట్ల కోసం 9222201122 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.

ఉదాహరణకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కు సంబంధించిన రేట్లు మీరు తెలుసుకోవాలంటే అనగా విజయవాడలో రేట్లు కోసం మీరు RSP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 127611కు ఎస్ఎంఎస్ పంపించాలి అప్పుడు మీకు ఒక ఎస్ఎంఎస్ ద్వారా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తెలుస్తాయి మీరు కింద ఉన్న ఇమేజ్ ని పరిశీలించండి

ఆయా పెట్రోలియం కంపెనీలకు సంబంధించిన డీలర్ల CODES కోసం క్రింద ఉన్న లింక్ ను మీరు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

Bharat Petroleum: Click Here

Indian Oil: click Here

HPCL PETROL: Click Here

By Sivamin

Leave a Reply

Your email address will not be published.