Mon. Oct 27th, 2025
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Government introduces a new registration mark for new vehicles  “Bharat series (BH-series)” to facilitate seamless transfer of vehicles

చ‌ల‌న‌శీల‌త‌ను సుల‌భ‌త‌రం చేసేందుకు ప్ర‌భుత్వం పౌరులు కేంద్రంగా అనేక చ‌ర్య‌లు తీసుకుంది. వాహ‌నాల రిజిస్ట్రేష‌న్‌కు ఐటి ఆధారిత ప‌రిష్కారం ఒక‌టి. వాహ‌న రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌లో దృష్టి పెట్ట‌వ‌ల‌సిన‌ అత్యంత ఇబ్బంది క‌లిగించే అంశం, వేరొక రాష్ట్రంలో ప‌ని చేసేందుకు వెళ్ళిన‌ప్పుడు వాహానాన్నితిరిగి రిజిస్ట్రేష‌న్ చేయించుకోవ‌డం. 
వేరొక ఊరికి బ‌దిలీ కావ‌డం అన్న‌ది ప్ర‌భుత్వ, ప్రైవేటు ఉద్యోగుల‌కు సర్వ‌సాధార‌ణం. అటువంటి సంద‌ర్భంలో ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న మోటారు వాహ‌నాల చ‌ట్టం 1988, ప్ర‌కారం ఒక వ్య‌క్తి తాను వాహ‌నాన్ని రిజిస్ట‌ర్ చేసుకున్న రాష్ట్రంలో మిన‌హా మ‌రే రాష్ట్రంలో అయినా 12 నెల‌ల‌కు మించి ఉంచుకోకూడ‌దు.అంతేకాదు, నిర్దేశిత 12 నెల‌ల లోపుగా నూత‌న రాష్ట్ర రిజిస్ట‌రింగ్ అథారిటీ కొత్త రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. 
వాహ‌నాన్ని తిరిగి రిజిస్ట‌ర్ చేసుకునేందుకు ఆ వాహ‌న య‌జ‌మాని దిగువ‌న పేర్కొన్న చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సి ఉంటుంది

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మ‌రొక రాష్ట్రంలో నూత‌న రిజిస్ట్రేష‌న్ ముద్ర వేయించుకునేందుకు తొలుత రిజిస్ట‌ర్ చేసుకున్న రాష్ట్రం నుంచి నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ పొందాలి.
(ii) కొత్త రాష్ట్రంలో రిజిస్ట్రేష‌న్ ముద్ర వేయించుకునేందుకు ప్రోరాటా ఆధారంగా ర‌హ‌దారుల ప‌న్నును  ముందుగా చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. 
(ii) అలాగే తొలుత న‌మోదు చేసుకున్న రాష్ట్రం నుంచి ప్రొరాటా ఆధారంగా ర‌హ‌దారుల ప‌న్నును వాప‌సు తీసుకునేందుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
తొలుత రిజిస్టర్ చేసుకున్న రాష్ట్రం రిఫండ్ తీసుకునేందుకు చేసిన ఏర్పాటు చాలా గ‌జిబిజి ప్ర‌క్రియ కావ‌డ‌మే కాదు ఒక రాష్ట్రం నుంచి మ‌రొక రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. 

వాహ‌నాల బ‌దిలీని ఎటువంటి స‌మ‌స్య‌లు లేకుండా చేసేందుకు, ర‌హ‌దారులు, ర‌వాణా & హైవేల మంత్రిత్వ శాఖ 26 ఆగ‌స్టు 2021న నోటిఫికేష‌న్ జారీ చేయ‌డం ద్వారా కొత్త వాహ‌నాల‌కు నూత‌న రిజిస్ట్రేష‌న్ ముద్ర‌ను – భార‌త్ సిరీస్ (బిహెచ్‌-సిరీస్‌)ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ రిజిస్ట్రేష‌న్ ముద్ర క‌లిగిన వాహ‌నానికి వాహ‌న యజ‌మాని మ‌రొక రాష్ట్రానికి బ‌దిలీ అయిన‌ప్ప‌టికీ నూత‌న రిజిస్ట్రేష‌న్ ముద్ర వేయించుకోన‌వ‌స‌రం లేదు. 
భార‌త్ సిరీస్ (బిహెచ్‌-సిరీస్‌)  రిజిస్ట్రేష‌న్ ముద్ర ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది –
రిజిస్ట్రేష‌న్ ముద్ర ఫార్మాట్: –

YY BH #### XX

YY – Year of first registration

BH- Code for Bharat Series

####- 0000 to 9999 (randomized)

XX- Alphabets (AA to ZZ)

నాలుగు అంత‌క‌న్నా ఎక్కువ రాష్ట్రాలు /  కేంద్ర‌పాలిత ప్రాంతాలు క‌లిగిన ప్రైవేట్ రంగ కంపెనీలు / సంస్థ‌లు, కేంద్ర‌/  రాష్ట్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, కేంద్ర ప్ర‌భుత్వ/  రాష్ట్ర ప్ర‌భుత్వ సిబ్బంది, ర‌క్ష‌ణ సిబ్బంది స్వ‌చ్ఛందంగా రిజిస్ట‌ర్ చేసుకునేందుకు భార‌త్ సిరీస్ (బిహెచ్‌-సిరీస్‌) కింద త‌మ వాహ‌నాల‌ను న‌మోదు చేసుకునేందుకు అందుబాటులో ఉంటుంది. 
 మోటారు వాహ‌నం ప‌న్నును రెండు సంవ‌త్స‌రాలు లేదా రెండేళ్ళ‌కు పైగా ఏళ్ళ‌కు విధిస్తారు. ఈ ప‌థ‌కం కింద వ్య‌క్తులు భార‌త‌దేశంలోని నూత‌న రాష్ట్రానికి లేదా కేంద్ర ప్రాంతానికి బ‌దిలీ అయిన‌ప్పుడు త‌మ వ్య‌క్తిగ‌త వాహ‌నాలలో స్వేచ్ఛ‌గా ప్ర‌యాణించే సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తుంది. ప‌ద్నాలుగ‌వ సంవ‌త్స‌రం పూర్తి అయిన త‌ర్వాత‌, మోటార్ వాహ‌నంపై ప్ర‌తి ఏడాది విధించే ప‌న్ను అంత‌కు ముందు విధించిన మొత్తంలో స‌గానికి త‌గ్గిస్తారు. 
జిఎస్ఆర్ 594 (ఇ) 26.08.2021 బిహెచ్ సిరీస్ రిజిస్ట్రేష‌న్ ముద్ర నిబంధ‌న‌లు

By Sivamin

Leave a Reply

Your email address will not be published.